టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా ప్రయత్నాలు చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా కొనసాగాలని సరికొట్తగా అడుగులు వేస్తున్నాడు. కానీ సునీల్ ఒకప్పటి కమెడియన్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు.

ఎన్ని సినిమాలు చేసినా అంతగా సక్సెస్ అవ్వడం లేదు.  2 కంట్రీస్ - సిల్లీ ఫెలోస్ సినిమాల అనంతరం సునీల్ పూర్తిగా కమెడియన్ గానే కనిపిస్తున్నాడు. అరవింద సమేత - అమర్ అక్బర్ ఆంటోని అలాగే చిత్ర లహరి - పడిపడి లేచే మనసు - చాణక్య వంటి సినిమాలు చేశాడు. ఆ పాత్రలేవి కూడా అనుకున్నంతగా క్లిక్కవ్వలేదు. ఇకపోతే ఇప్పుడు తన ఆశలన్నీ త్రివిక్రమ్ పైనే పెట్టుకున్నాడు. సునీల్ హీరో కాకముందు త్రివిక్రమ్ ప్రతి సినిమాలో నటించాడు.

ఆ సినిమాల్లో చేసిన కమెడియన్ పాత్రలన్నీ సునీల్ కి మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ అరవింద సమేతలో మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు 'అల వైకుంఠపురములో ' సినిమాపై కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది.

రన్ టైమ్ లో సునీల్ ఎక్కువ ఫోకస్ అయ్యేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడట. ఇక ఎడిటింగ్ లో సునీల్ కి సంబందించిన ఏ సీన్స్ కూడా పోకూడదని జాగ్రత్తపడుతున్నాడు. అలాగే తన నెక్స్ట్ సినిమాల్లో కూడా సునీల్ కి అవకాశాలు ఇవ్వాలని అతని కోసం  స్పెషల్ పాత్రలను క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. మరి సునీల్ ఈ ఇన్నింగ్స్ లో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.