టాలీవుడ్ అగ్ర దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. మాటలతో కట్టిపడేయడమే కాక తన స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలతో త్రివిక్రమ్ అలరిస్తారు. కాపీ మరకలకు త్రివిక్రమ్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు అతీతులు కారు. 

త్రివిక్రమ్ చిత్రాల్లో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలని ఇన్స్ పైర్ అయినట్లుగా ఉంటాయి. జులాయి, అత్తారింటికి దారేది, ఖలేజా లాంటి చిత్రాల్లో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సన్నివేశాలని పోలి ఉంటాయి. 

జులాయి చిత్రంలో బ్యాంక్ రాబరీ సన్నివేశం బాట్మాన్ ది డార్క్ నైట్ మూవీలోని సన్నివేశాన్ని పోలి ఉంటుంది. అలాగే అతడు చిత్రంలో మహేష్ బాబు బిల్డింగ్ మీది నుంచి జంప్ చేయడం, శివారెడ్డిని కాల్చే సన్నివేశం ఓ హాలీవుడ్ చిత్రాన్ని పోలి ఉంటుంది. 

అత్తారింటికి దారేది చిత్రంలో అబద్దాలు చెబితే ఆకులు రాలే సన్నివేశం, కారులోనే సమంత డ్రెస్ మార్చుకునే సన్నివేశం కూడా హాలీవుడ్ చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయినవే. ఖలేజాలో కొన్ని సన్నివేశాలు కూడా హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయినవే. ప్రస్తుతం ఆ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.