చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఒకే ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. జల్సా సినిమా నుంచి మొదలైన ఈ స్టార్స్ ప్రయాణం అప్పటి నుంచి అదే తరహాలో కొనసాగుతోంది. వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులైన పవన్ త్రివిక్రమ్ కలుసుకొని చాలా కాలమయ్యింది. ఓ వైపు పవన్ రాజకీయాలతో బిజీ అవ్వగా మరోవైపు త్రివిక్రమ్ తన సినిమాలతో బిజీ అయ్యాడు.

ఇక ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటున్నారని వార్తలు వస్తున్నప్పటికీ అభిమానులకు ఆ న్యూస్ నమ్మాలని అనిపించలేదు. ఇక ఇలా  సడన్ గా ఒకేసారి ఫోటోలో కనిపించడంతో ఇష్టమైన నాయకుడిని దర్శకుడిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. విజయవాడకు వెళ్లిన త్రివిక్రమ్ అక్కడ పవన్ ని స్పెషల్ గా కలుసుకున్నారు.  అయితే వీరి కలయికపై అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి.

ముందు నుంచి పవన్ పింక్ రీమేక్ పై త్రివిక్రమ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు తనదైన శైలిలో మాటలు అందించాలని ఆసక్తి చూపుతున్నారట.అలాగే పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్టయ్యే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని పవన్ త్రివిక్రమ్ చాలా రోజుల తరువాత ఇలా కనిపించడం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. మరి వీరి కలయిక వెనక ఎలాంటి చర్చలు జరిగాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.