ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కల్లెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'అల.. వైకుంఠపురములో' నిలిచింది. మొదటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా 2020లో టాప్ 1 ప్లేస్ ని అందుకున్న ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలనే సమయం చాలానే పడుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన రికార్డులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ కూడా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.  ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 'అల.. వైకుంఠపురములో' సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కిస్తే బావుంటుందని చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ దర్శకులకు ఇచ్చిన స్పెషల్ పార్టీలో ఈ విషయంపై డిస్కర్షన్ నడిచినట్లు తెలుస్తోంది. చాలా మంది  డైరెక్టర్స్ సీక్వెల్ అంశాన్ని త్రివిక్రమ్ ముందట ఉంచినట్లు టాక్.

ఇంతవరకు అలాంటి సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ చూపని మాటల మాంత్రికుడు మొదటిసారి ప్రయోగం చేస్తాడా లేదా అనేది చూడాలి.  ప్రస్తుతం త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఆ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ ఒక స్క్రిప్ట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ప్రస్తుతం వైరల్ అవుతున్న సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి.