మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురములో..' గతంలో  వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. త్రివిక్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తనలోని మార్క్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే.

మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  ఇప్పుడు అదే తరహాలో అల వైకుంఠపురములో కూడా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో పలు ఫైట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫైట్ చేస్తున్న ఆన్ లొకేషన్ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు ఇంటర్నెట్ క్లో వైరల్ గా మారింది.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో టేబుల్ మీద ఉండే ఫిన్నిస్ కి కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇక అలా వైకుంఠపురములో కూడా అలాంటి తరహాలోనే సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  రీసెంట్ గా ఎర్రటి బట్టతో అల్లు అర్జున్ కూడా విలన్లను చితకొట్టినట్లు ఒక స్టిల్ ని రిలీజ్ చేశారు. ఆ ఫోటో కూడా ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది.

గతంలో క్లాత్ తో త్రివిక్రమ్ ఇలాంటి మ్యాజిక్ లు చాలా చేశాడు. మరి ఈ సారి ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక రీసెంట్ గా రిలీజైన సామజవరగమన సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూస్తుండగానే యూట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాల డోస్ ని పెంచేసింది.  

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ,నటిస్తుండగా టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.