త్రిషా కృష్ణన్.. ఈ పేరు తెలియని వారుండరు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20ఏళ్లవుతోంది. 1999లో జోడి సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ డే రేంజ్ లో కొనసాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఈ భామ కెరీర్ ని ఒక పద్దతిగా సెట్ చేసుకుంటూ వస్తోంది.  పోటీగా ఎంత మంది హీరోయిన్లు వచ్చినా తనదైన శైలిలో అవకాశాలు అందుకుంది.

కుందనపు బొమ్మలా రాములమ్మ(శ్రీ ముఖి).. ఫోటోషూట్ అదిరింది!

నాలుగు పదులు వయసు దగ్గరపడుతున్న కూడా గ్లామర్ కొంచెం కూడా తేడా రాలేదు. ఇప్పటి హాట్ బ్యూటీలకు ఓ విధంగా త్రిష ఒక మంచి ప్రేరణగా నిలుస్తోంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇటీవల బేబీ మరో స్పెషల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మలయాళం మెగా ప్రాజెక్ట్ లో బేబీకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరక్కనున్న యాక్షన్ సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో దృశ్యం సినిమా వచ్చింది. మలయాళంలో ఆ సినిమా రికార్డు స్థాయిలో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇక ఇప్పుడు మరోసారి ఒక యాక్షన్ కథతో రాబోతున్నారు. ఆ కథలో కథానాయికగా త్రిషను ఒకే చేసినట్లు తెలుస్తోంది. త్రిషకు వరుసగా అవకాశాలు వస్తుండడంతో ఆమెపై కోలీవుడ్ లో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. కుర్ర హీరోయిన్స్ కి ధీటుగా సీనియర్ హీరోయిన్ వయసుతో సంబంధం లేకుండా అందరి హీరోలతో తెరపై రొమాన్స్ చేస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి త్రిష ఈ పోటీ ప్రపంచంలో ఇంకెంత కాలం నిలదొక్కుకుంటుందో చూడాలి.