సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ కొనసాగుతున్నా కూడా సీనియర్ హీరోయిన్ త్రిష రేంజ్ లో క్లిక్కవ్వలేదనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో 96సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ముందుకు సాగుతున్న ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి పై వివరణ ఇచ్చింది. అలాగే తనకు కాబోయేవాడు ఎలా ఉండాలనే విషయాన్నీ కూడా చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాను అనే విషయాన్నీ ఇప్పుడే చెప్పలేను కానీ ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పెళ్లి విషయంలో నా సొంత నిర్ణయమే నాకు ముఖ్యం.

పెళ్లి మాట అసలు వినను.లవ్ మ్యారేజ్ అంటేనే నాకు ఇష్టం. నాకు కాబోయేవాడు పెద్దగా అందగాడు అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. నన్ను అర్ధం చేసుకోవాలి. డబ్బు లేకపోయినా పరవాలేదు. నన్ను బాగా చూసుకుంటాడా లేదా అనేదే నాకు ముఖ్యం. అలాంటి వ్యక్తి పరిచయమైతే వెంటనే పెళ్లి చేసుకుంటా' అని త్రిష వివరణ ఇచ్చింది, మరి అలాంటి లక్షణాలున్న అబ్బాయి అమ్మడికి ఏ దేశంలో దొరుకుతాడో చూడాలి.