Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం ట్రేడ్ టాక్.. ఒక్క హిట్టు కూడా లేదే..!

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి అంతగా నచ్చలేదనే చెప్పాలి. పాతకాలం కథని పట్టుకొని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. 

trade talk of tenali ramakrishna, action movies
Author
Hyderabad, First Published Nov 23, 2019, 10:14 AM IST

చాలా కాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు పడక వెలవెలబోతోంది. తమిళ డబ్బింగ్ సినిమా 'ఖైదీ' తరువాత మరో హిట్ సినిమా రాలేదు. గత శుక్రవారం నాడు సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విషయంలో మేకర్స్ 'సినిమా బాగుంది కానీ కలెక్షన్లు రావడం లేదనే' స్టేట్మెంట్స్ ఇచ్చారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి అంతగా నచ్చలేదనే చెప్పాలి. పాతకాలం కథని పట్టుకొని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. అలానే విశాల్ నటించిన 'యాక్షన్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Sarileru Neekevvaru: మహేష్ బాబు రెమ్యునరేషన్ లో కోత!

తెలుగులో విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. మాస్ కి నచ్చే సినిమాలు, కొత్త తరహా కథలు ఎంచుకుంటారనే పేరు కూడా ఉంది. అలానే ఈ సినిమా కథని కూడా ఎన్నుకున్నాడు. దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు ఆడియన్స్ కి కొత్త రకంయాక్షన్ చూపించింది కానీ స్క్రిప్ట్ మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

ఏవరేజ్ మార్క్ లతో పాసైపోయింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం నాడు 'జార్జి రెడ్డి' సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై స్పెషల్ ఇంటరెస్ట్ చూపించడం, చిరంజీవి కూడా పాజిటివ్ గా మాట్లాడడం, కొన్ని వర్గాలు ఈ సినిమాని వ్యతిరేకించడం చేయడంతో సినిమాపై బజ్ పెరిగింది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ సినిమాతో పాటు వచ్చిన 'రాగల 24 గంటల్లో', 'తోలు బొమ్మలాట' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios