ఈ వారం ఇంటిసభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టూ ఫినాలే టాస్క్ ఈ సీజన్ కె హైలైట్ అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ  టాస్క్ ద్వారా బిగ్ బాస్ ఒక్కొక్కరి బలాబలాలని బిగ్ బాస్ పరిశీలించారు. టికెట్ టూ ఫినాలే కోసం బ్యాటరీని సేవ్ చేసుకునే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇద్దరేసి సభ్యులు టాస్క్ లలో పోటీ పడ్డారు. 

ఈ టాస్క్ లో రాహుల్ విజేతగా నిలిచాడు. మిగిలిన వరుణ్, బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖిలు నామినేట్ అయ్యారు. నామినేషన్ నుంచి బయట పడేందుకు బిగ్ బాస్ నేడు జరగబోయే ఎపిసోడ్ లో వీరికి ఓ అవకాశం ఇవ్వబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం.. హౌస్ లో సర్కస్ లాంటి టాస్క్ ఇవ్వబోతున్నారు. 

ఈ టాస్క్ లో నెగ్గుకురావడం అంత సులభం కాదు. ప్రోమోలో అలీ రెజా, బాబా భాస్కర్ తంటాలు పడుతూ కనిపిస్తున్నారు. ఇక శ్రీముఖి తనకు ఇచ్చిన టాస్క్ లో భాగంగా చేప లాంటి ఆకారంలో నోరు పెట్టి ఇబ్బంది పడుతూ కనిపిస్తోంది. ఇంత హీట్ లో కూడా బాబా భాస్కర్ జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. 

ఈ టాస్క్ మొత్తానికి రాహుల్ సంచాలకుడిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈవారం ఎలిమినేషన్ గురించి ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు హౌస్ లో ఎలాగోలా నెట్టుకొచ్చేసిన శివజ్యోతి ఈ  వారం ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.