Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య 'రూలర్'పై దెబ్బ పడుతుందా..?

డిసెంబర్ 20న 'రూలర్' రిలీజ్ అవుతుండగా.. ముందు వారంలో 'వెంకీమామ'ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. 'ఎఫ్ 2' తరువాత వెంకీ, 'మజిలీ' తరువాత చైతు కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Tough Competetion For Balayya's Ruler
Author
Hyderabad, First Published Dec 3, 2019, 5:09 PM IST

నందమూరి బాలకృష్ణ తన సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఎన్ని పెద్ద సినిమాలు బరిలో ఉన్నా.. పట్టించుకోకుండా రంగంలోకి దిగుతుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాలకు క్రేజ్ బాగా తగ్గింది. వరుసగా ఫ్లాప్ లు పడడంతో బాలయ్య కాస్త తగ్గాడు.

అందుకే తను నటించిన 'రూలర్' సినిమాను సంక్రాంతికి మానేసి మూడు వారాల ముందు క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయాలని భావించాడు. కానీ ఈ సీజన్ లో కూడా బాలయ్య సినిమా సేఫ్ అనుకోవడానికి లేదనిపిస్తోంది. డిసెంబర్ 20న 'రూలర్' రిలీజ్ అవుతుండగా.. ముందు వారంలో 'వెంకీమామ'ని రిలీజ్ చేస్తున్నారు.

''ఇన్నర్స్ చించేసి.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ..'' సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ పై దాడి!

ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. 'ఎఫ్ 2' తరువాత వెంకీ, 'మజిలీ' తరువాత చైతు కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా టాక్ బాగుంటే వారానికి మించి సినిమా ఆడుతుంది. పైగా జోనర్ చూస్తుంటే అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే సినిమాలా ఉంది. మరోవైపు 'రూలర్' సినిమాకి పోటీగా వస్తోన్న 'ప్రతిరోజు పండగే' సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించారు. అలానే దిల్ రాజు నిర్మించిన 'ఇద్దరి లోకం ఒకటే' లాంటి లవ్ స్టోరీ, 'మత్తు వదలరా' లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు క్రిస్మస్ సీజన్ కి రాబోతున్నాయి. ఇవి సరిపోవన్నట్లు సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమా కూడా అదే సమయానికి రాబోతుంది. వీటన్నింటితో పోలిస్తే 'రూలర్' పై ఆ స్థాయిలో బజ్ లేదు.

పైగా ఇటీవల విడుదలైన సినిమా టీజర్ పేలవంగా అనిపించింది. బాలయ్య లుక్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. బాలయ్య ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు లేవు. ఇలాంటి బజ్ తో, ఇంతటి కాంపిటిషన్ మధ్య సినిమా రిలీజ్ అంటే కచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మొత్తానికి బాలయ్య సినిమాపై పెద్ద దెబ్బ పడేలానే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios