20 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. అలాగే దర్శకుడు శంకర్ స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇకపోతే ఆ సినిమాకు సంబందించి సీక్వెల్ తో శంకర్ మరింత స్ట్రాంగ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. సాధారణంగా ఈ దర్శకుడు ఖర్చు చేసే విధానం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  

ఒక నెంబర్ అనుకుంటే నిర్మాత అందుకు ఒప్పుకొని తీరాల్సిందే. ముందే అగ్రిమెంట్ ప్రకారం నడుచుకునే శంకర్ గత కొన్నాళ్లుగా బడ్జెట్ పరిమితులను దాటించేస్తున్నాడు. సినిమాలు హిట్టయినంత వరకు శంకర్ చేప్పినట్లు నిర్మాతలు రిస్క్ చేశారు,. కానీ ఇప్పుడు ఎవరు కూడా అతని బడ్జెట్ లెక్కలకు వెంటనే ఒప్పుకోవడం లేదు.

2 పాయింట్ ఓ అనంతరం లైకా ప్రొడక్షన్ లోనే ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టిన శంకర్ ఈ ప్రాజెక్ట్ లో కూడా బడ్జెట్ పరిమితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.   ఈ వార్తలు గత కొంత కాలం నుంచి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నవే. రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాకు సంబందించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసుకున్న శంకర్ 40కోట్ల వరకు డిమాండ్ చేశాడట.

భోపాల్ లో పీటర్ హెయిన్స్ సారథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో అతి కీలకమైనవని. అందుకే శంకర్ మిగతా సీన్స్ లో కొంత బడ్జెట్ ని తగ్గించి ఈ సీన్ కోసం కేటాయించమని చెబుతున్నాడట. క్వాలిటీ కోసం శంకర్ అంత ఈజీగా తగ్గడనేది అందరికి తెలిసిన విషయమే. కానీ కాలం కలిసిరాకపోతే కొన్ని మనసు చంపుకొని చేయకతప్పదు.  

అందుకే శంకర్ నిర్మాతల కండిషన్స్ కి కాదనలేక క్వాలిటీ మిస్ అవ్వకుండా  బడ్జెట్ పరిమితులతో సినిమాను డిజైన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే కమల్ హాసన్ మార్కెట్ గతంలో ఉన్నట్లు గా ఇప్పుడు లేదు. 150కోట్లకు పైగా బడ్జెట్ ని కేటాయించడం రిస్క్ అనే చెప్పాలి. లైకా ప్రొడక్షన్ లో ఉన్న ప్రధాన అలజడి ఇదే. శంకర్ గత సినిమాలు ఐ - స్నేహితుడు - 2 పాయింట్ ఓ సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని శంకర్ కష్టపడుతున్నాడు.