తన మస్తికంలో పుట్టిన వేల నవ్వుల ఆలోచనలను ఈ ప్రపంచానికి వదిలేసి టామ్ అండ్ జెర్రీ సృష్టికర్త జీన్ డిచ్ కన్నుమూవారు. 95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ ఏప్రిల్ 16న మరణించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రజాదరణ పొందని కార్టూన్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే పేర్లు టామ్ అండ్ జెర్రీ. భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్టూన్ సూపర్ హిట్ అయ్యింది. కేవలం పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఈ కార్టూన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇతంటి ప్రజాదరణ పొందిన కార్టూన్ క్యారెక్టర్ మరోటి లేదనటం అతియోక్తి కాదేమో. అలాంటి సూపర్ పాపులర్ పాత్రలను సృష్టించింది దర్శకుడు జీన్ డిచ్ కన్నుమూశారు.
తన మస్తికంలో పుట్టిన వేల నవ్వుల ఆలోచనలను ఈ ప్రపంచానికి వదిలేసి ఆయన మాత్రం భౌతికంగా ఈ ప్రపంచానికి దూరమయ్యారు. 95 ఏళ్ల వయస్సున్న జీన్ డిచ్ ఏప్రిల్ 16న మరణించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో నివసించేశారు. గతంలో అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రాజీనామా చేశారు.
చిన్నతనం నుంచి బొమ్మగీయటం పట్ల ఎంతో ఇంట్రస్ట్ చూపించే జీన్, చాలా కార్టూన్ క్యారక్టర్స్ డిజైన్ చేశారు. తొలి ప్రయత్నంగా మన్నో అనే సినిమాను రూపొందించాడు. ఆ సినిమా 1960లో బెస్ట్ యానిమేటెడ్ సినిమా ఆస్కార్ ను సైతం గెలుచుకుంది. తరువాత టామ్ అండ్ జెర్రీ లను సృష్టించాడు. 13 ఏపిసోడ్లకు ఆయనకు స్వయంగా దర్శకత్వం వహించి రూపొందించారు. ఈ షోతో కూడా ఆస్కార్ అందుకున్నారు జీన్. ఆయన మృతి పట్ల అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రేమికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
