సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ప్రతి స్టార్ హీరో ఎదో ఒక సైడ్ బిజినెస్ తో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్స్ సినిమా థియేటర్స్ మల్టిప్లెక్స్ - ఫుడ్ బిజినెస్ లలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 సినిమాలతో యాడ్స్ తో బాగానే సంపాదిస్తున్నప్పటికీ బ్యాక్ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉండేలా ఒక ప్లాన్ వేసుకున్నాడట. కొత్త తరం టెక్నీషియన్స్  వెలికితీసి వారితో చిన్న బడ్జెట్ లో సినిమాలని నిర్మించాలని అనుకుంటున్నాడట. గతంలో ఎప్పుడు లేని విధంగా యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సినిమాల ద్వారా డబుల్ ప్రాఫిట్స్ లోకి తేవాలని అనుకుంటున్నాడట.

మొదట ఈ సలహా ఇచ్చింది రామ్ చరణ్ అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాగే కొత్త దరహా కథలను వింటూ వాటిని ఎన్టీఆర్ వైపుకు వెళ్లే చరణ్ సాయం చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ ప్రొడక్షన్ హౌజ్ కి తన కొడుకు, తండ్రి పేరులను కలిపి అభయ్ హరి ఆర్ట్స్ అని పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే తారక్ ప్రొడక్షన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.  మరి నిర్మాతగా తారక్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో చరణ్ అల్లూరి సీతామరాజు పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జులై 31న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.