సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజ కు గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ను దగ్గర లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

 

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన శివాజీ రాజా తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అధ్యకుడు గాను సేవలందించారు. అయితే ఇటీవల జరిగిన మా ఎలక్షన్ లో తీవ్ర స్థాయి లో వివాదాలు జరగటం తో కొంత కాలంగా ఆయన మీడియా కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.