కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ని ఢిల్లీలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కలిశారు. కల్లోలిత కాశ్మీర్ లోయలో సినిమా షూటింగ్ లు జరిపితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని అదేవిధంగా యూనిట్ సభ్యులకు భద్రత కల్పించాలని  కోరారు.

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో గతంలో భారతీయ బాషలలోని చిత్రాల చిత్రీకరణ సుందరమైన కాశ్మీర్ లోయలో స్వేచ్ఛ గా జరిగేవని, ఈ మధ్య కాలంలో చాలా వరకు శాంతిభద్రతల సమస్య కారణంగా కాశ్మీర్ లోయలో షూటింగ్ లు జరగడం లేదని, యు.కె లాంటి దేశాలు వాళ్ళ దేశంలో షూటింగ్ లు చేస్తే కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తున్నారని,ఇప్పుడు కాశ్మీర్ లోయలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి అని కేంద్రం ప్రకటించింది. కాబట్టి తిరిగి చలన చిత్రల చిత్రీకరణ కొరకు వచ్చే యూనిట్ సభ్యులకు భద్రత తో పాటు కొన్ని ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అలా ఇస్తే మరల కాశ్మీర్ లోయలో షూటింగ్ ల పునర్ వైభవం కొనసాగుతుందని కేతిరెడ్డి కిషన్ రెడ్డిని కోరారు. 

కిషన్ రెడ్డికి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న రీత్యా సమావేశాలు  ముగిసిన అనంతరం తగిన విధంగా ఈ సమస్య గురించి పేద్దలతో మాట్లాడి  చర్యలు తీసుకొంటామని, అదేవిధంగా  దేశంలోని అన్ని బాషల సినీపరిశ్రమలకి చెందిన వారితో కూడా ఈ విషయమై చర్చించుతామని వారు తెలియచేసారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు.