ప్రముఖ నిర్మాత సి వెంకటరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

గీత చిత్ర ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై పదహారు చిత్రాలను నిర్మించిన ఆయనకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన నిర్మించిన 'ఘర్షణ', 'పెళ్లిచేసుకుందాం', 'శ్రీమతి వెళ్లొస్తా', 'పవిత్ర బంధం' వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి.

వెంకటరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం చెన్నైలో నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.