స్టార్ హీరోలు ఎంత మంది ఉన్న ఈ మధ్య కాలంలో కొంత మంది మీడియం హీరోల స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అందులో నాని ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాని ఈ ఏడాది కూడా బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో గ్యాప్ తీసుకోకుండా నాని వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడు.

అవన్నీ ఈ సంవత్సరం రాకపోవచ్చు గాని ఇదే ఏడాది మూడు సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నెక్స్ట్ నాని పూర్తిగా నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. 'టక్ జగదీష్' అని టైటిల్ తోనే సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించిన నాని ఆ సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపించబోతున్నాడట.

ఇక ఆ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి మరో సినిమాని కూడా ఇదే ఏడాది మొదలుపెట్టి ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ ఒక వెర్షన్ స్క్రిప్ట్ చేసుకొని న్యాచురల్ స్టార్ కి వినిపించినట్లు సమాచారం. నానికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త తడబడుతున్నట్లు టాక్.  అయితే స్క్రీన్ ప్లేలో కాస్త మార్పులు చేసి మరో వెర్షన్ ని రెడీ చేసుకొమ్మని నాని యువ దర్శకుడికి సలహా ఇచ్చినట్లు టాక్. మరో సిట్టింగ్ తో దాదాపు  ఆ కథకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా ఈ ఏడాది వస్తుందా లేదా అనేది సందేహమే. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఒక సినిమాని రిలీజ్ చేస్తే బెటర్ అని నాని ఆలోచిస్తున్నట్లు సమాచారం.