టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. సరికొత్త ట్యూన్స్ తో విడుదలకు  ముందే సినిమాలకు మంచి క్రేజ్ తెస్తున్నాడు. ఒక నెల గ్యాప్ లోనే థమన్ సంగీతం అందించిన 4 సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలన్నీ చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాయి. "అల'..వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి.

అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. అలాగే వెంకీ మామ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు పండగే పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గత కొన్ని నెలలుగా థమన్ గ్యాప్ లేకుండా వర్క్ తో బిజి అవుతున్నాడు. ఓ వైపు స్పెషల్ సాంగ్స్ ని అందిస్తూ మరోవైపు సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా థమన్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ థమన్ బాలీవుడ్ లో కూడా మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బాలీవుడ్ లో థమన్ కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. సింబా - గోల్ మాల్ 4 సినిమాలకు కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఇక ఇప్పుడు తెలుగులో థమన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుండడంతో బాలీవుడ్ ప్రముఖులు థమన్ పై కన్నేశారు.

ప్రస్తుతం రెండు కథలు డిస్కర్షన్స్ లో ఉన్నాయట. సెట్స్ పైకి వెళితే.. థమన్ కి అవకాశం ఇవ్వాలని ఓ ప్రముఖ నిర్మాత డీలింగ్ సెట్ చేసుకునే ప్రయత్నాలో ఉన్నారట. త్వరలోనే ఈ విషయంపై థమన్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇక నెక్స్ట్ బోయపాటి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.