ఈ ఏడాది టాలీవుడ్ బిగ్ హిట్స్ లో రామ్ సినిమా టాప్ లిస్ట్ లో నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తనలోని మాస్ నటనను బయటపెట్టిన రామ్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ అదే ఫ్లోలో విజయాల్ని అందుకోవాలని రామ్ నెక్స్ట్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు.

హోమ్ బ్యానర్ లో కిషోర్ తిరుమలతో ఇటీవల ఒక సినిమాను మొదలుపెట్టాడు. నేడు రెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా సెట్స్ పైకి వచ్చింది.  గత కొంత కాలంగా అనేక కథలను వింటున్న రామ్ ఫైనల్ గా కిషోర్ చెప్పిన రెడ్ అనే థ్రిల్లర్ కథను ఒకే చేశాడు. రామ్ ఫస్ట్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో మరో స్మార్ట్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఒక వీడియో విడుదల చేసిన రామ్ యాక్షన్ సన్నివేశాల్లో తనకు తగిలిన గాయాల్ని చూపించాడు.

యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో పలు ఫైట్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఒక భారీ యాక్షన్ సన్నివేశంలో రామ్ కి గాయాలయ్యాయి. నన్ను సీన్స్ కోసం చాలా కష్టపెడుతున్నారని అందుకు చాలా హ్యాపీగా ఉందని.. వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా రామ్ వివరణ ఇచ్చాడు.

ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.  గతంలో రామ్ తో నేను శైలజా - ఉన్నది ఒక్కటే జిందగీ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ ఈ సారి డిఫరెంట్ యాక్షన్ జానర్ ని ఎంచుకోవడం చూస్తుంటే సినిమా మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు..స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.