తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సినీ హీరో రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

హైదరాబాద్: తెలుగు సినీ హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. రామ్ చరణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే తనకు కోవిడ్ లక్షణాలు ఏవీ లేవని కూడా చెప్పారు.

మంగళవారం ఉదయం రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని త్వరలో తాను తెలియజేస్తానని ఆయన చెప్పారు.

నాలుగు రోజుల క్రితం రామ్ చరణఅ కుటుంబ సభ్యులతో క్రిస్ట్మస్ వేడుకలు జరుపుకున్నారు. వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆచార్య సెట్ కు కూడా వెళ్లారు. 

దర్శకుడు కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేషన్ సెల్వరాజ్ లను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ సేవిస్తూ ఆయన అందరినీ పలకరించారు. దాంతో వారందరిలోనూ టెన్షన్ నెలకొంది.

Scroll to load tweet…