టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు నితిన్ కెరీర్ ఒడిదుడుకులకు గురైంది. 

తిరిగి ఇష్క్ చిత్రంతో పుంజుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. చాలా రోజులుగా ప్రభాస్, రానా, నితిన్, రామ్ పోతినేని లాంటి హీరోల వివాహంపై టాలీవుడ్ లో ఆసక్తిక చర్చ జరుగుతోంది. 

వీళ్లంతా మూడుపదుల వయసు దాటేశారు. దీనితో సహజంగానే పెళ్లి ప్రస్తావన వస్తుంది. ప్రభాస్ లాగే నితిన్ కూడా పెళ్లి విషయం మాట్లాడకుండా తప్పించుకుంటున్నాడు. ఇంట్లో తొందరపడుతున్నారని తానే ఎప్పటికప్పుడు వాయిదా  వేస్తూ వస్తున్నాని నితిన్ కొన్ని సంధర్భాల్లో తెలిపాడు. 

తాజాగా నితిన్ వివాహానికి సంబంధించిన ఆసక్తికర సమాచారం అందింది. నితిన్ 2020లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నితిన్ కొంతకాలంగా ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె సినీ పరిశ్రమకు చేసిన అమ్మాయి కాదు. వివరాలు ప్రస్తుతానికైతే గోప్యంగా ఉన్నాయి. 

వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో నితిన్ పెళ్లి జరగబోతున్నట్లు సమాచారం. దీనిపై నితిన్ త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నితిన్ కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. హీరోలు, హీరోయిన్ల విషయంలో అనేక ఎఫైర్ రోమర్స్ వినిపిస్తుంటాయి. కానీ నితిన్ కు అలాంటి రిమార్క్స్ లేవు. 

నితిన్ ప్రస్తుతం వెంకీకుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.