టాలీవుడ్ లో బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. ఇక మొత్తానికి కొంత మంది కుర్ర హీరోలు 2020లో పెళ్లికి సిద్ధం కాబోతున్నారు.

ఇప్పటికే నితిన్కి ఒక అమ్మాయిసెట్టయ్యింది. పెళ్లి ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే అదే తరహాలో మరో కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా పెళ్లికి సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలైతే రెండేళ్ల క్రితమే ఈ హీరో పెళ్లి కావాల్సింది. కానీ జాతకాలు కలవలేదని ఆగిపోయినట్లు టాక్ వచ్చింది. దీంతో మళ్ళీ గ్యాప్ తీసుకున్న నిఖిల్ కెరీర్ పై ద్రుష్టి పెట్టాడు. మొత్తానికి అర్జున్ సురవరం సినిమాతో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.

నెక్స్ట్ ఇక ఒక మంచి ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనీ అనుకుంటున్నాడట. అర్జున్ సురవరం సినిమా తరువాత నిఖిల్ మరో సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి రెండు సినిమా కథలను సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాని ఒకే చేసినట్లు తెలుస్తోంది. మరీ నిఖిల్ ని కట్టుకోబోయే ఆ సుందరి ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.