ట్రోల్స్, రివ్యూస్ పై స్పందించాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తనకు ఓ ఏడాది టైమ్ ఇస్తు.. తానేంటో నిరూపించకుంటాను అంటున్నాడు కిరణ్. తాజాగా రూల్స్ రంజన్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్అవుతున్నాయి. 


ఓ ఏడాది టైమ్ ఇవ్వండి నేనేంటో నిరూపిస్తాను అంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తన సినిమాల గురించి, తన అభిమానుల గురించి.. తన ఫెయిల్యూర్స్ గురించి. తనను విమర్షించే వారి గురించిషార్ట్ అండ్ స్వీట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు యంగ్ హీరో. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే...? 

సినిమా గురించిమాట్లాడాలి అటే చాలా ఉంది అన్నారు కిరణ్ అబ్బవరం. మన తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. ఎంత మంది సెలబ్రిటీ స్టార్స్ ఉన్నారు. ఏదో ఒక రోజు మీ సపోర్ట్ తో ఆ స్థాయికి వెళ్తాను అన్నారు కిరణ్. ఇంకొ ఏడాది టైమ్ ఇవ్వండి.. మీరు గర్వపడేలా సినిమా చేస్తాను... అందరు షాక్ అయ్యేలాంటిసినిమా చేస్తాను అన్నారు కిరణ్. కిరణ్ కామెంట్లు చూస్తుంటే.. వచ్చే ఏడాది వరకూ.. భారీ స్థాయిల్ పాన్ ఇండియా సినిమాపై కన్నేసినట్టు అర్ధం అవుతుంది. 

ఇక కిరణ్ అబ్బవరం ట్రోలర్స్ గురించి.. సినిమా రివ్యూస్ గురించి కూడా మాట్లాడారు. ముందుగా తనను ఇంతలా ఆదరిస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు కిరణ్. తాను యూట్యూబర్ గా ఉన్నప్పటి నుంచి.. ఆదరిస్తూ.. తన షార్ట్ ఫిల్మ్స్ ను కూడా ఆదిరించి.. హీరోగా తన ఎదుగుదలకు ఎంతో ప్రోత్సహించారు.. హిట్ పడితే పండగ చేసుకున్నారు. ప్లాప్ పడితే.. కిరణ్ అన్నా నీవెంట మేమున్నాము అని.. నన్ను తమ ఇంట్లో మనిషిగా ఓన్ చేసుకుని దైర్యం చెప్పిన అభిమానులకు రుణపడి ఉంటాను అన్నారు. 

 

Scroll to load tweet…

అంతే కాదు అలాంటి అభిమానులు గర్వపడేలా సినిమా చేస్తానన్నారు కిరణ్. ఇక ట్రోల్స్ వస్తుంటాయి.. రివ్యూస్ వింటున్నాము.. తిడుతుంటారు, మెచ్చుకుంటారు.. అందరు ఏది చేసినా.. సినిమా కోసమే.. ట్రోల్ చేసేవారు కూడా సినిమాఅంటే ఇష్టం ఉండబట్టే ట్రోల్ చేస్తారు...సినిమాపై ఎంత ప్రేమ లేకుంటే రివ్యూస్ ఇస్తారా.. కాని మీరు ఏది చేసినా.. సినిమా కోసమే చేయండి.. సినిమా బాగుంటేనే మనం అంతా బాగుంటాం. సినిమా చేయడానికి ఎంతో శ్రమ పడతారు. అప్పుడు రకరకాల కామెంట్లతో ఇబ్బందిపెట్టకుండా.. సినిమా మీద ఇస్టంతో ట్రోల్ చేయండి, రివ్యూస్ ఇవ్వండి అన్నారు కిరణ్. ప్రస్తుతం కిరణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇక రూల్స్ రంజన్ సినిమా విషయానికి వస్తే..కిరణ్ అబ్బవరం  హీరోగా .. రతినం కృష్ణ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రూల్స్ రంజన్. ఈ చిత్రం ను అక్టోబర్ 6, 2023 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఆవెంట్ గ్రాండ్ గా జరిగింది.