సూపర్ స్టార్ రజినీకాంత్ కి అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది 'దర్బార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నారు.  

ఈ సినిమాలో ఖుష్బూ, నయనతార, మీనా, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ వంటి తారలు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ హీరో గోపీచంద్ ని తీసుకోవాలని భావిస్తున్నారట.

బ్లాక్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి.. కిల్లర్ లుక్స్!

దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో సముఖంగా ఉన్నారని టాక్. కెరీర్ ఆరంభంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత విలన్ గా మారి సినిమాలు చేశాడు గోపీచంద్.

విలన్ గా ఆయన చేసినవి మూడు సినిమాలే అయినప్పటికీ ఆయన నటనని అంత ఈజీగా మర్చిపోలేం. హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఒకానొక దశలో స్టార్ రేంజ్ కి చేరుకున్న గోపీచంద్ కి కొంతకాలంగా హిట్లు రావడం లేదు. ప్రస్తుతం 'సీటీమార్' అనే సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ గనుక రజినీకాంత్ సినిమా ఒప్పుకుంటే మరోసారి ఆయనలో విలనిజం చూసే ఛాన్స్ దక్కుతుంది.