గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల వర్షం కురుస్తోంది. క్లియరెన్స్ సేల్ పెట్టినట్లుగా వరస పెట్టి  చిన్న సినిమాలు ధియోటర్ లో దిగుతున్నాయి. అయితే ఆ వస్తున్న వాటిలో చాలా భాగం  చిన్న బోతున్నాయి. ఆడియన్స్‌ని మెప్పించే సినిమాల సంఖ్య తగ్గిపోతుండటంతో -ఇండస్ట్రీ కళ తప్పుతోంది. నవంబర్ నుంచీ ఈ పరిస్దితి కనపడినా డిసెంబర్ ప్రారంభం మరీ దారుణంగా తయారైంది. మంచి సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించటం లేదు.

ఈ వారం రిలీజైన మధనం, 90 ఎమ్ ఎల్, మిస్ మ్యాచ్, భాగ్యనగరం  వీధుల్లో సినిమాలు ఏవీ మినిమం ఓపినింగ్స్ కూడా తెప్పించుకోలక చతికిల పడ్డాయి. ఒక్క సినిమా కూడా ఆడే వాతావరణం కనపడటం లేదు. 90 ఎమ్ ఎల్ చిత్రం కు సూపర్ హైప్ క్రియేట్ అయినా కంటెంట్ సరిగ్గా లేకపోవటంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లైంది. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ రావటం పెద్ద దెబ్బగా మారింది. పాయింట్ కొత్తగా అనిపించినా పాత కాలం స్క్రీన్ ప్లే సినిమాని దారుణంగా మార్చేసింది.

సినిమా చూసినవాళ్లు ఇంటికెళ్లి ఓ పెగ్ వేసుకోవాలని సినిమాని మర్చిపోయేలా చేసే  కోరిక పుట్టేలా చేసింది.మందు అలవాటు లేనివాళ్లు ఓ స్ట్ట్రాంగ్ టీ తాగితే కానీ బుర్ర స్టడీకి రాని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. వెంకీ మామ సినిమా వచ్చేదాకా ఈ సిట్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయ్యేటట్లు కనపడుతోంది.  ఇలా వరసగా విడుదల అవుతున్న చిన్న సినిమాలు డిజాస్టర్ అవటం ..ఇండస్ట్రీని ప్రక్కన పెడితే ఔత్సాహికులను భారీగా దెబ్బ కొట్టే విషయం. వాస్తవానికి పెద్ద సినిమాలు ఎన్నొచ్చినా ఇండస్ట్రీకి ఊపే తప్ప -ఊతమైతే కాదన్నది  అందరికీ తెలిసిన సత్యం.

చిన్న సినిమా ఎంత బలంగా నిలబడితే ఇండస్ట్రీ అంత కళకళలాడుతుంది. గత రెండు మూడు నెలల్లో వచ్చిన చిన్న సినిమాలేవీ ఆడియన్స్‌ని మెప్పించే స్టామినా చూపించలేకపోవడంతో -తెలుగు పరిశ్రమ ఒక్కసారిగా కళ తప్పినట్టు కనిపిస్తోంది. ఆమధ్య వచ్చిన సాహో, సైరాలాంటి పెద్ద సినిమాలు హడావుడి చేసినా, పదుల సంఖ్యలో వచ్చే చిన్న సినిమాలేవీ నిలబడలేకపోవడంతో టాలీవుడ్ క్యాష్ కౌంటర్ ఖాళీ  అయిపోయిందన్న భావన కనిపిస్తోంది.