రీసెంట్ గా హాస్పిటల్ పాలు అయ్యాడు కమెడియన్ యాదమ్మ రాజు. అసలేం జరిగింది అనేది వెల్లడించకుండా హాస్పిటల్ లో కట్లతో బెడ్ పై ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా తన అనారోగ్యానికి కారణం వెల్లడిచాడు రాజు..షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. 

కామెన్ మెన్ గా ఆడియన్స్ లో ఒకడిగా పటాస్ షోకి వచ్చి.. ఒక్క ఛాన్స్ తో సెలబ్రిటీ కమెడియన్ గా ఎదిగాడు యాదమ్మ రాజు. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతున్న రాజు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తున్నాడు. కామన్ మెన్ నుంచి కమెడియన్ గా మారి.. స్టార్ ఇమేజ్ సాధించాడు యాదమ్మ రాజు. పటాస్ ద్వారా పరిచయమైన యాదమ్మ రాజు... తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో బుల్లితెర కామెడీ స్టార్ గా మారిపోయాడు. 

లేడీగెటప్ లు, తెలంగాణ యాసలో డైలాగ్స్ కు రాజు ఆయపెట్టింది పేరు. అమాయకంగా కనిపిస్తూ.. పంచుల మీద పంచులు వేస్తూ.. సెలబ్రిటీలను సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఘనత రాజుది. తన ఫీల్డ్ లోనేయూట్యూబర్ గా ఫేమస్ అయిన స్టెల్లాను ప్రేమించి పెళ్ళాడిన రాజు..హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఇక తాజగా ఆయనకు ప్రమాదం జరిగింది. గత కొద్ది రోజులుగా హస్పటల్ బెడ్ కేపరిమితం అయ్యాడు యాదమ్మ రాజు. 

ప్రస్తుతం జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన కామెడితో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటు టెలివిజన్ షోలు చేస్తూ.. అటు సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు. ఎప్పుడూ హుషారుగా.. జోరు చూపించే యాదమ్మ రాజు.. రీసెంట్ గా హాస్పిటల్ పాలు అయ్యాడు. తాజాగా యాదమ్మ రాజు ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన కాలుకు ఏమయ్యిందని రాజు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఆ విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చాడు యాదమ్మ రాజు. 

తనకు యాక్సిడెంట్ అయ్యిందని.. అందులో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు తెలిపారు. యాదమ్మ రాజు హాస్పిటల్ లో ఉన్న ఓ వీడియోని, స్టెల్లా తనకి సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్న వీడియోని ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతానికి యాదమ్మ రాజు కాలి దెబ్బ తగ్గడానికి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.

తాజాగా యాదమ్మ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ గురించి చెప్పాడు. యాదమ్మ రాజు మాట్లాడుతూ.. టీ తాగడానికి బయటకి వెళ్ళాను. ఎదురుగా ఒక బండి స్కిడ్ అయి వచ్చి గుద్దింది. కాలి మీద నుంచి వెళ్లడంతో బాగా ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్ కి వెళ్తే కుడి కాలుకు ఉన్న ఒక వేలుని తీసేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసి ఒక కాలి వేలుని తీసేశారు. తొడ దగ్గర కొంచెం చర్మం తీసి అక్కడ వేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

ప్రస్తుతం రాజు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనపని తాను చేసుకుంటున్నా.. అనుకోని ప్రమాదం తనను ఇలా చేయడంతో.. రాజు బాగా ఎమోషనల్ అవుతున్నాడు. రాజు నటించిన సినిమాల ఫంక్షన్స్ ఉండటంతో.. రీసెంట్ గా స్టిక్ పట్టుకుని తాను నటించిన స్లమ్ డాగ్ హస్భండ్ సినిమా ప్రమోషన్స్ కు అతి కష్టం మీద వచ్చాడు. కొన్ని ప్రమోషన్లు బెడ్ పై ఉండే చేశాడు రాజు. రాజుకు జరిగిన ఈ ప్రమాదంతో బుల్లితెర నటులు యాదమ్మ రాజును పరామర్శిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.