రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో  పలువురు సినీ నిర్మాతలు, నటులు మొక్కలు నాటారు. 

నిర్మాతలు కేఎస్ రామారావు, రాజ్ కందుకూరి, సింగర్ ఆర్పీ పట్నాయక్, నటులు శివాజీ రాజా,ఏడిద శ్రీరామ్, బెనర్జీ, కాశీ విశ్వనాద్  కందుకూరి శివ, భవానీ ప్రసాద్ కాదంబరి కిరణ్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేఎస్ రామారావు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ రోజు రోజుకు ఎంతో గొప్పగా సాగుతుంది. ఇప్పటికే 5 కోట్ల మొక్కలకు పైగా నాటడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. 

బెనర్జీ మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి చేతులెత్తి మొక్కుతునా అని అన్నారు. మొక్కలు  నాటుతూ..నాటిస్తూ ఎంతో మంది కి ఆక్సిజన్ అందిస్తున్నారని ప్రశంసించారు.