నేడు దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు, విజయశాంతి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మరికొందరు తారలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

వీర జవానులని కలుసుకునే అవకాశం రావడం గౌరవంగా భవిస్తున్నాను. నా జీవితంలో ఇది ఒక మరచిపోలేని రోజు. ప్రతిరోజు మనకోసం కష్టపడే వీర సైనికులకు నా సెల్యూట్. హ్యాపీ రిపబ్లిక్ డే.. మహేష్ బాబు ట్వీట్ చేశారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో కలసి.. సైనికులతో రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న చిత్రాలని షేర్ చేశాడు. 

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సెట్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఆ దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్, రాంచరణ్ మాత్రం కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ డే సంధర్భంగా వీర జవానులని స్మరించుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. 

అందాల చందమామ కాజల్ ఆగర్వాల్  సోషల్ మీడియా వేదికగా రిపబ్లిక్ డే విషెష్ తెలియజేసింది. 

హీరో మంచు విష్ణు స్కూల్ పిల్లలతో కలసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు.