టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వేగం పుంజుకుంది. సెలెబ్రిటీలు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే హీరో అక్కినేని అఖిల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాడు. అఖిల్ ఇందులో నాగ చైతన్య, వరుణ్ తేజ్ లని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని కొందరు సినీ ప్రముఖుల్ని నామినేట్ చేసారు. దీనితో పరుచూరి గోపాల కృష్ణ సోదరుడు వెంకటేశ్వర రావు, నటుడు జయప్రకాష్ రెడ్డి, కాదంబరి కిరణ్ లాంటి ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

వీరంతా జూబ్లీ హిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఏఈ కార్యక్రమంలో కొందరు టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.