ప్రధాని నరేంద్ర మోడీ  పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఈ సాయంత్రం ఐదు గంటలకు కరతాళధ్వనులతో వైద్య సిబ్బందికి సంఘీభావం తెలియజేసారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశం మొత్తం ఐక్యంగా, బలంగా ఎదుర్కొంటామని ప్రజలంతా చప్పట్లతో తెలియజేశారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఎవరికీ వారి తమ నివాసాల్లో గంటలు మోగించడం, చప్పట్లు కొట్టడం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నివాసంలో కాస్త ఎత్తులో వేలాడదీసిన గంటని మోగించాడు. తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఎత్తుకుని ఎన్టీఆర్ గంట కొట్టడం విశేషంగా ఆకట్టుకుంటోంది. అభయ్ రామ్ చప్పట్లు కొడుతుండగా.. ఎన్టీఆర్ గంట మోగించాడు. ఆ వీడియోను ఇంస్టాగ్రామ్లో షేర్ చేశాడు. 

ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టాడు. చూస్తుంటే చరణ్ అప్పుడే నిద్రపోయి లేచినట్లు ఉన్నాడు. 

 

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలసి చప్పట్లు కొట్టాడు. బన్నీ సతీమణి, పిల్లలు, అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

పూరి జగన్నాధ్, మంచు మనోజ్, ఇతర సెలెబ్రిటీలంతా తమ కరతాళధ్వనులతో వైద్య ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. హీరోయిన్ ప్రణీత సుభాష్ తన కుక్కతో కూడా చప్పట్లు కొట్టించింది. ఈ వీడియోలు, దృశ్యాలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.