యువనటుడు శ్రీవిష్ణు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. 

తాజాగా శ్రీవిష్ణు నటించిన మూవీ 'తిప్పరా మీసం'. విజయ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంతో తన విజయపరంపరని శ్రీవిష్ణు కొనసాగించాలని భావిస్తున్నాడు. విడుదలకు తక్కువ సమయమే ఉండడంతో శ్రీ విష్ణు ఈ చిత్ర ప్రచార  కార్యక్రమాల్ని విశాఖ నగరం నుంచి ప్రారంభించాడు. 

తిప్పరా మీసం చిత్ర యూనిట్ నేడు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో పాల్గొంది. శ్రీవిష్ణు, హీరోయిన్ గా నటించిన నిక్కీ తంబోలి, నిర్మాత రిజ్వాన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. నా జన్మస్ధలం విశాఖపట్నం నుంచి సినిమా ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నాడు.  అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపాడు. ముఖ్యంగా యువతకు ఈ మూవీ బాగా నచ్చుతుందని అన్నాడు. హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. నా తొలి చిత్రం ఇదే. తొలి చిత్రంలోనే మంచి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. 

ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు దక్కుతుందని నిక్కీ ఆశాభావం వ్యక్తం చేసింది. తన బ్రోచేవారెవరురా చిత్రానికి వైజాగ్ నుంచే అత్యధిక వసూళ్లు వచ్చాయని శ్రీవిష్ణు తెలిపాడు. అంతకు మించేలా ప్రేక్షుకులు తిప్పారా వీసం చిత్రాన్ని ఆదరించాలని కోరాడు.