యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే ట్యాగ్ తో బాలీవుడ్ తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్న హీరో టైగర్ ష్రాఫ్.  భాగీ సీక్వెల్స్ తో ఆడియెన్స్ మంచి కిక్కుస్తున ఈ కండలవీరుడు మూడవ సీక్వెల్ తో యాక్షన్ డోస్ మరీంత పెంచుతున్నట్లు తెలుస్తోంది. భాగీ 3 ట్రైలర్ ని  రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆడియెన్స్ లో అంచనాలను మరీంత పెంచేసింది.

కథ సింపుల్ అండ్ రొటీన్ అని తెలుస్తోన్నప్పటికీ సోదరుడి కోసం దేశం కోసం ఎంత దూరమైనా వెళతాను అన్నట్లుగా టైగర్ చేసిన యాక్షన్ బావుంది. సిరియా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతోంది. ఇక ఫైట్స్ అయితే నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉన్నాయి. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. వార్ సినిమాతో హృతిక్ తో కలిసి బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న టైగర్ ఇప్పుడు భాగీ 3తో మరొక సెన్సేషన్ ని క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. మరీ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మార్చ్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది.