శుక్రవారం...ఇది ఓ సినిమా పండగ. కొత్త సినిమాలు వచ్చి థియోటర్స్ లో దిగి సినీ ప్రేమికులకు ఆనందం కలగచేస్తూంటాయి. అయితే అందులో ఏవి  బాగుంటాయి..ఏవి బాగోవు అనేవి ప్రక్కన పెడితే ఓ కొత్త సినిమా మాత్రం కనిపిస్తుంది. ఈ శుక్రవారం కూడా మన తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాలుగా అని ఆశ్చర్యంగా చూడకండి..అక్షరాలా నాలుగు సినిమాలే వస్తున్నాయి. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవటంతో వాటి టైటిల్స్ కూడా చాలా మందికి తెలియని సిట్యువేషన్ ఉంది. ఇంతకా ఆ సినిమా లు ఏమిటి..

రాజుగారి గది 3 : కొద్దో గొప్పో ఈ వారం వచ్చే సినిమాలు అన్నిటికన్నా క్రేజ్ ఉన్న సినిమా రాజుగారి గది 3. ఈ సినిమాపై పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఫన్ ‌తో టైంపాస్ అయిపోతుందని సినీ లవర్స్ భావిస్తున్నారు. హీరోగా ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు.. హీరోయిన్ గా అవికా గోర్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరకి పెద్ద  క్రేజ్ లేకపోవడంతో హిట్ టాక్ వస్తేనే ఈ సినిమా నిలబడుతుంది.

‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ : ఈ సినిమా గురించి మీడియాలో అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనపడటం లేదు. అందుకు కారణం వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న  సాయి కుమార్ కొడుకు ఆది హీరోయిన్ గా చేయటమే. దాంతో ఈ  ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’కు  కూడా అంతంత మాత్రంగానే ఉంది. పోస్టర్స్, ట్రైలర్స్ ని బట్టి యాక్షన్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. కశ్మీరీ పండిట్‌ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రం అని చెప్తున్నారు. దాంతో  సినిమా అదిరిపోయిందని టాక్ వస్తే తప్ప దీని కోసం ప్రత్యేకించి థియేటర్స్‌కి వెళ్ళరు.

కృష్ణారావు సూపర్ మార్కెట్ :
ఈ సినిమా గురించి అయితే చాలా మంది వినని కూడా లేదు.  అయితే ఈ రెండింటితో పాటు ఈ  చిన్న సినిమా కూడా ఈ  రోజు వస్తోంది.  కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సూపర్ మార్కెట్ చుట్టూనే కథ నడుస్తుంది. ప్రముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ఇది. అయితే అసలు ఈమూవీ ఈ  రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియదు.

‘మళ్ళీ మళ్ళీ చూశా’ : ఈ నాలుగో సినిమా విషయానికొస్తే.. క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మించిన  చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌కి శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.

సైరా తర్వాత.. : మెగాస్టార్ సైరా తరువాత తెలుగులో చెప్పుకోవడానికి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. గోపీచంద్ చాణక్య వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఉన్నంతలో డబ్బింగ్ సినిమా వార్ నడుస్తోంది.  దాంతో ఈ రోజు రిలీజ్ అయ్యే నాలుగుస్ట్రెయిట్ సినిమాల ప్రభావం పెద్దగా కనపడనట్లే కనపడుతోంది.  ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం నిలబడుతుందో అదే విన్నర్.