ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ విష్ణు. రొటీన్ కి భిన్నంగా ట్రై చేసే శ్రీ విష్ణు నెక్స్ట్ కూడా అదే తరహాలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు కష్టపడుతున్నాడు. తిప్పారా మీసం అనే సినిమా చేస్తోన్న ఈ టాలెంటెడ్ యాక్టర్ దసరా సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. చూస్తుంటే సినిమాలో డిఫరెంట్ షేడ్స్ తో కిక్కిచ్చేలా కనిపిస్తున్నాడు.

బీస్ట్ మోడ్.. ఆన్ / ఆఫ్ అంటూ పోస్టర్ తో క్యారెక్టర్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. అంటే శ్రీ విష్ణు రెండు రకాల మోడ్స్ లలో తన క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కుర్ర హీరో తన లుక్ తో మరోసారి తన సినిమాకు మంచి క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక గత నెలలో తిప్పరా మీసం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన నిమిషాల్లోనే ఆ టీజర్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు న్యూ పోస్టర్ తో మరింత బజ్ క్రియేట్ చేశాడు. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలో సినిమాను విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. నిక్కీ తంబోలి , రోహిణి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.