స్టార్ హీరోలతో స్టేజ్ షోలు చేయించడానికి నిర్వాహకులు ఆసక్తి చూపుతుంటారు. దీనికోసం మన హీరోలకు కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తుంటారు. అలాంటి కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన విషయాన్ని అల్లు అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్టేజ్ షో నిర్వాహకులు తనతో ప్రోగ్రాం చేయడానికి కోట్లలో పారితోషికం ఆఫర్ చేశారని.. కానీ వాటిపై తనకు ఆసక్తి లేదని చెప్పాడు.

చీర కట్టులోనూ అనసూయ క్లీవేజ్ షోలు.. చలికాలంలోనూ చెమటలు!

అందుకే ఎప్పుడూ స్టేజ్ షోలు చేయలేదని చెప్పారు. 'అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ కాన్సర్ట్ లో వేదికపై తనకు తెలియకుండా డాన్స్ చేసినట్లు.. ముందుగా ప్లాన్ చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. స్టేజ్ పై అంతసేపు ప్రశంగిస్తానని కూడా అనుకోలేదని.. అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు చేసిన కామెంట్స్ నిజమేనని చెప్పాడు అల్లు అర్జున్. స్టార్ హీరోలంతా విచిత్రమైన జోన్లో.. ఉన్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాత్మక సినిమాలు చేయలేమని..  కొత్తదనం ఉంటూనే కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే సినిమాలు చేయాలని.. లేదంటే బయ్యర్లు నష్టపోతారని చెప్పిన మహేష్ వ్యాఖ్యలతో తను ఏకీభవిస్తున్నట్లు చెప్పాడు అల్లు అర్జున్.

వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో.. పది కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీయలేరని.. అది నిర్మాతలకు, ట్రేడ్ కి మంచిది కాదని.. ఒకవేళ ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. కూడా అవి లార్జ్ స్కేల్ లో తీయాల్సిఉంటుందని చెప్పుకొచ్చారు.