సారాంశం

ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్‌ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు.


‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్ ని సాధించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆ సినిమా విషయంలో తలెత్తిన వివాదాలే సినిమాని నిలబెట్టేసాయని చెప్పాలి.  ఆ ఉత్సాహంలో దర్శకుడు  వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రాన్ని తీసుకొచ్చారు. ‘ది వ్యాక్సిన్ వార్’టైటిల్ తో రూపొందిన ఈ  సినిమాపై రిలీజ్ కు చాలా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ సలార్ సినిమాపై ఈ చిత్రం వేద్దామనుకున్నారు. అయితే సలార్ ప్రక్కకు వెళ్లింది. దాంతో ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 28) థియేటర్లలో రిలీజ్ అయింది. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్‌ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. 

అయితే, అనుకున్న స్థాయిలో ఓపినింగ్స్ , మొదటి రోజు కలెక్షన్లు ‘ది వ్యాక్సిన్ వార్’ దక్కించుకోలేకపోయింది. రెండో రోజు నుంచి అయితే మరీ దారుణం అంటోంది ట్రేడ్.మినిమం కలెక్షన్స్ కూడా లేక చాలా చోట్ల షోలు పడని సిట్యువేషన్. కోవిడ్ రోజులను గుర్తు చేసే ఈ సినిమాలను మళ్లీ ఆ కష్టాలను తలుచుకోవటానికి జనం ఆసక్తి చూపలేదు. దాంతో ప్రింట్ కాస్ట్ కూడా రావటం లేదు. డొమాస్టిక్ మార్కెట్ లోనే కాదు ఓవర్ సీస్ లోనూ సేమ్ సిట్యువేషన్. 

సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో ది వ్యాక్సిన్ వార్ మూవీ రూపొందింది. కరోనా  సమయంలో భారత సైంటిస్ట్ లు వ్యాక్సిన్ తయారు చేసేందుకు చేసిన కృషిని, ఎదుర్కొన్న సవాళ్లను వివేక్ అగ్నిహోత్రి.. ఈ ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో చూపించారు. ఏడు నెలల కాలంలో భారత్ సొంత వ్యాక్సిన్‍ను ఎలా రూపొందించిందనేది తెరకెక్కించారు.  ఓ వర్గానికి మాత్రం ఈ సినిమా నచ్చుతోంది.  ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుందని,. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుందని అంటున్నారు.

 ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుందని మెచ్చుకుంటున్నారు. అయితే అవేమీ థియేటర్స్ దగ్గరకు జనాలని తీసుకెళ్లలేకపోతున్నాయి.   వివేక్ అగ్నిహోత్రి గత చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగటం లేదు డబ్బులు తెచ్చిపెట్టడం లేదు. ఓవరాల్ గా భాక్సాఫీస్ దగ్గర  ఈ సినిమా ఇదే పరిస్దితి రాబోయే రోజుల్లో కొనసాగితే డిజాస్టర్ అయ్యినట్లే. 
  
ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో నానా పటేకర్, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, రీమాసేన్, గిరిజ ఓక్ కీలకపాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా.. రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా, స్వప్నిల్ సంగీతం అందించారు.