Asianet News TeluguAsianet News Telugu

The Warriorr: నైజాం రైట్స్ ఎంత చెప్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాకే!

సత్య ఐపీఎస్ పాత్రలో  రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.  యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.  
 

 The Warriorr producer quoting  14CR Nizam !
Author
Hyderabad, First Published Jul 5, 2022, 2:18 PM IST


 హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో నిర్మాతలు చెప్పుతున్న రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అవుతున్నారు. రామ్ కెరీర్ లోనే ఏ సినిమాకు పలకని రేట్లు ఈ సినిమాకు చెప్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నైజాం రైట్స్ ..14 కోట్లు చెప్తున్నట్లు వినికిడి. ఇస్మార్ట్ శంకర్ చిత్రం నైజాంలో బాగా కలెక్ట్ చేసింది. అది దృష్టిలో పెట్టుకుని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ మూవీనుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సత్య ఐపీఎస్ పాత్రలో  రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.  యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.  

 ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు ఫ్యాన్సీ అమౌంటు కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.   ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios