Dhanush : 'ది గ్రే మ్యాన్' చిత్రాన్ని జూలై 22న ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్టు నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఈమేరకు ట్విట్టర్‌లో తన ఫస్ట్‌లుక్ పోస్టర్ ను పంచుకున్నారు.
Dhanush's Hollywood Film : వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుంటూ బాలీవుడ్, టాలీవుడ్ లలో తనదైన ముద్ర వేస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న నటుడు ధనుష్.. తాను నటించిన హాలీవుడ్ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'ఎండ్‌క్యామ్', 'కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్' మరియు 'సివిల్ వార్' చిత్రాలకు దర్శకత్వం వహించిన సోదరులు ఆంథోనీ రూసో మరియు జో రూసో దర్శకత్వంలో రాబోయే హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' లో ధనుష్ నటించారు. మాస్.. పవర్ ఫుల్ లుక్ లో కనిస్తున్నాడు. ఓ కారుపై ఉన్న ధనుష్ ముఖంపై బ్లడ్ కనిస్తూ.. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ధనుష్ గ్రే మ్యాన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"ది గ్రే మ్యాన్" ఒక యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ధనుష్ నటించిన గ్రే మ్యాన్ సినిమా షూటింగ్ అమెరికాలో జరిగింది. అందుకోసం నటుడు ధనుష్ దాదాపు మూడు నెలల పాటు యూఎస్ లోనే ఉండి చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ర్యాన్ కాస్ట్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ మరియు జెస్సికా హెన్విక్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ సైట్ 1500 కోట్ల రూపాయలతో డీల్ చేసుకున్నట్టు సమాచారం. అయితే, గ్రేమ్యాన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇదివరకే విడుదల చేసినప్పటికీ.. అందులో ధనుష్ కనిపించలేదు.
దీంతో ధనుష్‌కి సంబంధించిన సన్నివేశాలను విడుదల చేయాలని ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నెట్టింట్లో విడుదల చేశారు. అయితే నటుడు ధనుష్ ఇందులో కనిపించలేదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ పేజీలో నటుడు ధనుష్ తన ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్ట్ చేశాడు. ధనుష్ నటించిన 'ది గ్రే మ్యాన్' చిత్రాన్ని జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీడీలో విడుదల చేయనున్నట్లు ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. దీనిని నెట్‌ఫ్లిక్స్ రీ-ట్వీట్ చేసింది.
గ్రే మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న విడుదల చేయనున్నారు. అయితే ఇది ఒక వారం ముందు జూలై 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు సమాచారం. తాజా అప్డేట్ తో ధనుష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
