‘బంగార్రాజు’తో హిట్ సాధించిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘ది గోస్ట్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విదేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి లోకేషన్స్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కింగ్ నాగార్జున (King Nagarjuna) హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోస్ట్’ (Ghost). ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల సంక్రాతి బ్లాక్ బాస్టర్ మూవీ బంగార్రాజు (Bangarraju)తో ఫుల్ జోష్ లో ఉన్నారు నాగార్జున. ఇక ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘ది గోస్ట్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. లేటెస్ట్ రిపోర్టర్స్ ప్రకారం.. నాగార్జున సహ ది ఘోస్ట్ బృందం దుబాయ్‌లోని పలు లోకేషన్లలో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన నటులు- నాగార్జున మరియు సోనాలి చౌహాన్ (Sonali Chauhan)ల మధ్య ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, ఇతర సీన్స్ చిత్రీకరిస్తున్నట్టు వర్గాలు వెల్లడించాయి.
గతంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మహిళా కథానాయికగా నటించడానికి షెడ్యూల్ చేశారు. కానీ ఆమె గర్భవతి కావడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ తర్వాత, ఇలియానా డి'క్రూజ్ కూడా ది గోస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటుున్నట్టు వచ్చిన వార్తలు కూడా తేలిపోయాయి. చివరగా సోనాలి చౌహాన్ మహిళా ప్రధాన పాత్రను పోషించేందుకు ఫైనల్ అయ్యారు. అయితే ప్రస్తుతం నాగార్జున, సోనాల్ చౌహాన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ లోని పలు పాపులర్ లోకేషన్లలో చిత్రీకరణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ హారర్ ఫాంటసీ డ్రామాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై తెరకెక్కిస్తున్నారు. భరత్-సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.సినిమాటోగ్రాఫర్‌గా ముఖేష్ జి, ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల, ఈ ఏడాది చివర్లో మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డాక్టర్ రాజశేఖర్ నటించిన పిఎస్‌వి ‘గరుడ వేగ’ థ్రిల్లర్‌తో ఇన్‌స్టంట్ ఫేమ్ తెచ్చుకున్న ప్రవీణ్ సటారు. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.