దర్శకధీరుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’RRR. ఈ చిత్రం కోసం నాలుగేండ్లుగా  శ్రమించారు. అయితే మేకింగ్ కు సంబంధించిన పలు విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

బిగ్ మల్టీస్టారర్, పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. ఎట్టకేళలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్, ఆడియెన్స్ తో జాతర వాతావరణం నెలకొందంటే సినిమా ఎంత సన్సేషన్ క్రియేట్ చేస్తుందో అర్థమవుతోంది. ఇప్పటికే పలు రేటింగ్ సంస్థలు, విమర్శకులు కూడా ‘ఆర్ఆర్ఆర్’ను జక్కన్న చెక్కిన విధానానికి ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా ఇంత మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీం ఎంతో శ్రమించిందని చెప్పాలి. దాదాపుగా నాలుగేండ్ల నుంచి వారి నిరంతర క్రుషి ఫలితమే బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ కు కారణమైంది. ఈ మూవీకి మేకింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు మతిపోగొడుతున్నాయి. 

2018లో స్టార్ట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణంగా కోవిడ్, తదతర కారణాల వల్ల వాయిదా పడుతూ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయి రికార్డులను బ్రేక్ చేసే దిశగా పయనిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ చిత్రీకరణ కోసం రెండు వారాల పాటు టీం మొత్తం ఉక్రేయిన్ లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి ప్రెసిడెంట్ ప్యాలెస్ లో ఈ సాంగ్ ను షూట్ చేయడం విశేషం. అలాగే మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొమురం భీం పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర తాలుకా పరిచయ సన్నివేశాలను బల్గేరియాలో చిత్రీకరించారు. అలాగే రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సీన్స్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ చేశారు. 

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభానికి ముందు 200 రోజుల్లో పూర్తి చేయాలని అంచనా వేశారు. కానీ 300 రోజులు సినిమా చిత్రీకరణకు సమయం పట్టినట్టు సమాచారం. కానీ, షూటింగ్ కు ముందు 200 రోజుల సమయం కేవలం రిహార్సల్స్, ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ కే సరిపోయిందంట. అలాగే బహుబలి తరహా ఆర్ఆర్ఆర్ సెట్ ను కూడా వేయించారు జక్కన్న. ఇందుకు గండిపేటలోని పది ఎకరాల స్థలంలో ఢిల్లీకి సంబంధించిన కొన్ని సెట్స్ ను ప్రత్యేకంగా వేయించారు. ఈ సెట్స్ లో చరణ్, ఎన్టీఆర్ కలిసి బ్రిటిషర్స్ పై పోరాడే సన్నివేశాలను చిత్రీకరించారు. 

మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కు లండన్ నుంచి 2500 మంది స్టంట్ మెన్స్ ను రప్పించారంట. అలాగే మరో 50 మంది స్టంట్ ఎక్స్ పర్ట్స్ ను ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారని సమాచారం. అలాగే లండన్ కు చెందిన ప్రముఖ కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీ ‘మూవీ పిక్చర్ కంపెనీ’ని రాజమౌళి ఈ చిత్రం కోసం సంప్రదించినట్టు సమాచారం. రూ. 300 కోట్ల అంచనా బడ్జెట్ తో ఈ చిత్రం ప్రారంభించినా చివరికి రూ. 550 కోట్లకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఇక టెక్నిషీయన్స్ విషయానికొస్తే అన్ని డిపార్ట్ మెంట్లకు సంబంధించి మొత్తం 3000 మంది ఇన్వాల్వ్ అయ్యారంట. మరోవైపు రాజమౌళి కింద తొమ్మిది మంది కో-డైరెక్టర్స్ పనిచేశారని తెలుస్తోంది. ఇలాంటి ఆశ్చర్యపరిచే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయంట. మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్ లో భాగంగా కూడా రాజమౌళి ఎంతమంది టెక్నీషియన్లు పనిచేశారో తెలిపిన విషయం తెలిసిందే. వారందరికీ హార్డ్ వర్కే ఆర్ఆర్ఆర్ అని కూడా తెలిపాడు.