పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎవరు ఉహించని విధంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న తరుణ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.

అయితే దర్శకుడిగా నెక్స్ట్ తరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.  అయితే వెబ్ సిరీస్ లతో మాత్రం తప్పకుండా వస్తానని అంటున్నాడు. మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు.

తరుణ్ చేసిన రెండవ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ని బాగా ఆకర్షించింది. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమా మంచి లాభాలనే అందించింది. అయితే ఆ సినిమా పాయింట్ నీ తీసుకొని వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు.  అలాగే బిటెక్ అనే మరో కాన్సెప్ట్ తో కూడా రాబోతున్నట్లు వివరణ ఇచ్చాడు.

అయితే వెంకటేష్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై దర్శకుడు కామెంట్ చేయలేదు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేష్ బాబు నిర్మిస్తున్న ఆ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మీకు మాత్రమే చెప్తా సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.