ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. "అల'..వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. అలాగే వెంకీ మామ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు పండగే పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  గత కొన్ని నెలలుగా థమన్ గ్యాప్ లేకుండా వర్క్ తో బిజి అవుతున్నాడు.

ఓ వైపు స్పెషల్ సాంగ్స్ ని అందిస్తూ మరోవైపు సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా థమన్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ థమన్ బాలకృష్ణ సినిమాకు కూడా సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం రూలర్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఆ తరువాత బోయపాటి శ్రీనివాస్ తో మరో సినిమా చేయనున్నాడు.

అయితే ఆ సినిమాకు థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి బాలయ్య రూలర్ సినిమా రిలీజ్ అయినా తరువాత తన సినిమాని పట్టాలెక్కించనున్నాడు. గతంలో థమన్ బాలయ్య డిక్టేటర్ సినిమాకు సంగీతం అందించాడు. ఇక బోయపాటి డైరెక్ట్ చేసిన సరైనోడు సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇక చాలా రోజుల తరువాత ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ కలనుంది. మరి ఈ సారి ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.