టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య  కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు వర్క్ చేస్తున్నారా లేదా అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటె ఓ వైపు థమన్ తన మ్యూజిక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే దేవి చేస్తున్న ఒక్క సినిమా పాట కూడా రిలీజ్ చేయడం లేదు. పైగా థమన్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా 4 సినిమాలకు పనిచేస్తున్నాడు.

 క్రిస్మస్ - సంక్రాంతి పండగల్లో థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నుంచి మాత్రం సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్ 'ప్రతి రోజు పండగే' - రవితేజ 'డిస్కో రాజా' సినిమాలకు థమన్ డిఫరెంట్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న క్రిస్మస్ టైమ్ లో సందడి చేయనున్నాయి. డిస్కో రాజా లోని వింటేజ్ సాంగ్ ఇప్పటికే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

అలాగే వెంకీ మామ సినిమాకు కూడా థమన్ ట్యూన్స్ సెట్ చేస్తున్నాడు.   ఇక సంక్రాంతి బిగ్ మూవీస్ లో ఒకటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్ 'అల..వైకుంఠపురములో..' సినిమతో థమన్ మరింత గోల పెట్టనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. విడుదలైన రెండు పాటలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

కానీ దేవి శ్రీ ప్రసాద్ నుంచి మాత్రం ఒక్క సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కంటే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ గట్టిగా కొనసాగుతున్నాయి.  మహేష్ కేవలం పోస్టర్స్ నే వదులుతున్నాడు. అల్లు అర్జున్ మాత్రం సాంగ్స్ తో రచ్చ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ సెట్ చేశాడు అనే కామెంట్స్ వస్తున్నాయి కానీ ఎందుకో ఇంకా వాటిని రిలీజ్ చేయడం లేదు. మహర్షి సాంగ్స్ అయితే ఎక్కువ రోజులు వినపడలేదు. అందుకే దేవి కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. పైగా థమన్ డామినేట్ చేస్తుండడంతో బెస్ట్ మ్యూజిక్ అందించాలని దేవి కష్టపడుతున్నట్లు టాక్.