కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్దమయ్యాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగిల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమా ట్రైలర్ ని కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమాపై అంచనాల డోస్ ని మరింతగా పెంచేసింది. 

యాక్షన్ తో పాటు హెవీ ఎమోషన్ కూడా ఉన్నట్లు క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా విజయ్ మాస్ లుక్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. సినిమాలో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సినిమాకి మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. 

సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ గా అలాగే జట్టు కోచ్ గా విజయ్ విన్నమైన పాత్రల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు. సినిమాకు ఇదే మరో హైలెట్ పాయింట్. ఏఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను AGS ఎంటర్టైన్మెంట్ ను భారీ బడ్జెట్ తో నిర్మించింది. విజయ్ - అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో సినిమాపై తెలుగులో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగులో విజిల్ పేరుతో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.