టాలీవుడ్ లో గతకొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ప్రస్థానం నటుడు ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఫైనల్ గ అనిను వీడని నీడను నేనే అంటూ ఒక సింపుల్ హిట్ అందుకున్నాడు.

 ఇక ఇప్పుడు తెనాలి రామకృష్ణ BA.BL అంటూ ఒక కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే హైదరాబాద్, కర్నూలు, తెనాలి, రాజమండ్రి‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సినిమా చూసిన వారి ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

read also:ముదురు భామలతో కుర్ర హీరోలు.. హాట్ రొమాన్స్!

సినిమాలో ఓ వర్గం వారికి నచ్చే కామెడీ సీన్స్ చాలానే ఉన్నాయని అలాగే చిరాకు తెప్పించే బోరింగ్ సీన్ కూడా ఉన్నాయని చెబుతున్నారు.  ముఖ్యంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన పలు అంశాలను బేస్ చేసుకొని దర్శకుడు క్రియేట్ చేసిన కామెడీ బావుందని అంటున్నారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కెఏ.పాల్ హంగామాతో పాటు - కోడికత్తి, గ్రామ వాలంటీర్లు వంటి అంశాలను సినిమాలో గట్టిగా వాడేశారట.

ఇక సినిమాలో హీరో సందీప్ కిషన్ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మెప్పించినట్లు చెబుతున్నారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు వంటి కమెడియన్స్ చేసిన అల్లరి సినిమాలో గట్టిగానే క్లిక్కయ్యిందట.  అయితే అక్కడక్కడా సినిమా నిడివి కాస్త ఇబ్బంది పెట్టినట్లు టాక్ వస్తోంది. మొత్తానికి సందీప్ అయితే పాజిటివ్ టాక్ ని ఎక్కువగా అందుకుంటున్నాడు.

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ నటన కూడా సినిమాలో మరో హైలెట్ పాయింట్. సినిమా చివరలో దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మరి కలెక్షన్స్ ఏ స్థాయిలో అందుకుంటాడో చూడాలి.