ఇటీవల జరిగిన శంషాబాద్ హత్యాచార ఘటన టాలీవుడ్ ని కూడా కదిలించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినీ తారలు బయటకు వచ్చి ఘటనపై స్పందిస్తున్నారు. ఇకపోతే ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని మన స్టార్ హీరోలు జనాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హత్యాచార ఘటనలపై ఒక సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు కొరటాల శివతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. వీరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన శ్రీమంతుడు - భరత్ అనే నేను సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలతో ఒక సోషల్ మెస్సేజ్ ని ఇచ్చిన మహేష్ ముడవసారి కొరటాలతో కలిసి హత్యాచార ఘటనలపై తనవంతు గళాన్ని విప్పాలని ఇలాంటి ఘోరాలు జరగకుండా మంచి సందేశాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

 

ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దర్శకుడు కొరటాల శివ త్వరలోనే మెగాస్టార్ 152 సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. మెగాస్టార్ మూవీ ఫినిష్ అయిన తరువాత మహేష్ తాను అనుకున్న సబ్జెక్టును కొరటాలతో సెట్స్ పైకి తేవాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.