Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

తెలుగు సినియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు. గుంటూరులోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు.

Telugu sr actor Jayaprakash Reddy dies
Author
Guntur, First Published Sep 8, 2020, 7:52 AM IST

గుంటూరు: తెలుగు సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఉదయం బాత్రూంలో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మరణించారు.

తెలుగు సినిమాల్లో రాయలసీమ మాండలికంలో ఆయన విలనిజాన్ని పండించారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు. తెలుగు సినిమాల్లో ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు. 

తూర్పు జయప్రకాశ్ రెడ్డి 1946 అక్టోబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సిర్వేల్ లో జన్మించారు. బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహా రెడ్డి సినిమాలో పోషించిన వీరరాఘవరెడ్డి పాత్ర అతనికి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. విలన్ పాత్రను పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

జయం మనదేరా, చెన్నకేశవ రెడ్డి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. హాస్య పాత్రలను కూడా పోషించారు. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆయనను నంది అవార్డు కూడా వరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios