Asianet News TeluguAsianet News Telugu

సినీ పాత్రికేయులకు అండగా తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్‌

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్షించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏ రోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని భ‌రోసా తెలియ‌జేసారు.

Telugu Film Journalists Association helping 35 Families
Author
Hyderabad, First Published Apr 3, 2020, 5:21 PM IST

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్షించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏ రోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని భ‌రోసా తెలియ‌జేసారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు ల‌క్ష్మి నారాయ‌ణ గారు మాట్లాడుతూ.. ` ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హాజ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి , వీడియో జ‌ర్న‌లిస్ట్ ల‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకుల తో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము.

ఏ ఒక్క‌రూ ఆక‌లిలో ఉండ‌కూడ‌ద‌నేది  మా అసోషియెష‌న్ ముఖ్య ఉద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ గారికి గాని, రాంబాబు గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు. మీ అంద‌రికి చివ‌రిగా నా ప్ర‌త్యేఖ‌మైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా ఉండి పోరాడాలి. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్ళి అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా కోరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదన్నుగా ఉన్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు` అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios