సాధారణంగా హీరో, హీరోయిన్లు లగ్జరీ కార్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే వారికి లగ్జరీ కార్లు కొనడం పెద్ద విషయమేమీ కాదు. తమ స్టేటస్ ఇదని చెప్పుకోవడానికి కూడా లగ్జరీ కార్లు, అపార్ట్మెంట్లు కొంటూ ఉంటారు.

అయితే ఈ ఆమధ్య కాలంలో బుల్లితెరపై కనిపించే యాంకర్లు కూడా లగ్జరీ కార్లు సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ లేనప్పటికీ తమ డ్రీం కారుని మాత్రం సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ ఆడి SUV కారుని సొంతం చేసుకుంది.

తాజాగా యాంకర్ మంజూష మెర్సిడెస్ బెంజ్ కారుని దక్కించుకుంది. దాదాపుగా పదేళ్ల నుండి ఇండస్ట్రీలో కెరీర్ సాగిస్తున్న ఈ భామకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. 'రాఖీ' సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా కనిపించిన తరువాత మరో సినిమాసైన్ చేయలేదు.

చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ కాలం గడుపుతోంది. ఇప్పుడు ఈ భామ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తను కొత్త కారు కొన్నట్లు మంజూష సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.  


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Can’t believe that I bought my dream car!! With god’s blessings.. So much in love with it😍😍

A post shared by Manjusha Rampalli (@anchor_manjusha) on Oct 7, 2019 at 6:07am PDT