Asianet News TeluguAsianet News Telugu

వైభవంగా తెలుగు నటి వెడ్డింగ్ రిసెప్షన్

గత కొన్ని రోజులుగా ఈ పాప పెళ్లి వేడుకలకు సంబందించిన  ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ అర్చన మూడుముళ్ల బంధంతో తన ప్రేమికుడికి మరింత దగ్గరైంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోన్నఅర్చన రిసెప్షన్స్ కూడా ఘనంగా జరిగింది. 

telugu actress archana reception party photos viral
Author
Hyderabad, First Published Nov 14, 2019, 8:17 AM IST

నేను సినిమాతో టాలీవుడ్ కి బాగా దగ్గరైన అందమైన తెలుగు నటి అర్చన. గత కొన్ని రోజులుగా ఈ పాప పెళ్లి వేడుకలకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ అర్చన మూడుముళ్ల బంధంతో తన ప్రేమికుడికి మరింత దగ్గరైంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోన్నఅర్చన రిసెప్షన్స్ కూడా ఘనంగా జరిగింది.  

హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల నిర్ణయంతో ఈ యువ జంట ఈ నెల 13న పెళ్లి చేసుకుంది. రీసెంట్ వీరి సంగీత్ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో అర్చన కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. సంగీత్ లో బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ కూడా పాల్హోన్నాడు.

వధువరుడు ఇద్దరు కూడా సంగీత్ వేడుకలో స్టెప్పులేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.   కొన్ని రోజుల క్రితం ప్రియుడితో అర్చన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో కూడా అర్చన తన ప్రియుడి ఫొటోల్ని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అర్చన ప్రియుడితో కలసి ఉన్న ఫోటో షేర్ చేసి త్వరలోనే మీ అందరికి గుడ్ న్యూస్ చెబుతా అంటూ అభిమానులకు తెలియజేసింది.

దీంతో అర్చన త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని అభిమానులు ఊహించారు.ఫైనల్ గా నవంబర్ 13న హైదరాబాద్ లో వైభవంగా మూడుముళ్ల బంధంతో ఈ జంట మరింత దగ్గరైంది. వేడుకకు పలువురు సినీ సెలబ్రెటీలు అలాగే రాజాకీయ నాయకులు వ్యాపారవేత్తలు ముఖ్య అతిధులుగా పాల్గొనబోతున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో మెరిసిన అర్చన ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మరి పెళ్లి అనంతరం అర్చన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios